సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసిపి ఇన్చార్జ్ ఎడం బాలాజీ.. రావి రామనాథం బాబు మరికొందరు వైసిపి నాయకులు
సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసిపి ఇన్చార్జ్ ఎడం బాలాజీ.. రావి రామనాథం బాబు మరికొందరు వైసిపి నాయకులు
పర్చూరు నూతన వైసిపి ఇన్చార్జిగా ఎడం బాలాజీ నియామకంతో పర్చూరు వైసిపి వర్గ విభేదాలు సమస్య పోనున్నాయా?
ఆమంచి కృష్ణమోహన్ ఇన్చార్జిగా ఉన్న సమయంలో గ్రూపు రాజకీయాలు సమసి పోలేదు.. అదిగాక ఆమంచి చూపు చీరాల వైపే ఉండడంతో రావి రామనాథం బాబును ఇన్చార్జిగా తొలగించిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో పర్చూరు ఇన్చార్జిగా కొనసాగేందుకు ఆమంచి ఒప్పుకున్నారు.. అయితే ఒకానొక సమయంలో బలరాంతో ఉన్న విభేదాలు రీత్యా ఆయన బలమైన కమ్మ సామాజిక వర్గం ని ఉద్దేశించి చేసిన పరుష పదజాలం తీవ్ర దుమారాన్నే లేపింది...
తర్వాత ఆయన తన వ్యాఖ్యలను సవరించుకునే ప్రయత్నం చేశారు... అదిగాక చీరాల కేంద్రంగా ఆది నుండి రాజకీయాలకు అలవాటు పడ్డ ఆమంచి పర్చూరులో వర్గ విభేదాలు లేకుండా చేయడం లో సఫలీకృతులు కాలేకపోయారు.. ఇక తనకు బాగా పట్టు సంబంధాలు ఉన్న చీరాలే శ్రేయస్కరం అనే రీతిలో ఆయన తన అభిప్రాయాన్ని సీఎం జగన్ కి తెలియజేయడంతో చీరాల టికెట్ ని ఆశించడంతో అది సాధ్యం కాదనే విషయం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు..
ఇక ఆమంచి కూడా చీరాల నుండి జనసేన లేదా టిడిపి టికెట్ అందుకొని పోటీ చేయడమా లేదా అవకాశం లేకపోతే ఇండిపెండెంట్గా నైనా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది..
ఈ పరిస్థితుల మధ్య ఎడం బాలాజీని నూతన ఇంచార్జిగా సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించారు..
ఆయన పర్చూరు నియోజకవర్గంలో వైసిపి నాయకులైన రావి రామనాథం బాబును,బత్తుల బ్రహ్మానంద రెడ్డి, గాద వెంకటరెడ్డి వంటి నాయకులను కలిసి తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరారు... దాదాపు అందరూ ఎడం బాలాజీ ఇన్చార్జి నియామకం పట్ల సంతృప్తిగా ఉన్నట్లే తెలుస్తోంది..
రానున్న రోజుల్లో ఎడం బాలాజీ వీరి సహకారంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాల అండతో విజయాన్ని వరిస్తారేమో వేచి చూడాల్సిందే..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0