మంత్రి హోదాలో పంగులూరులో పెన్షన్లు పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి
మంత్రి హోదాలో పంగులూరులో పెన్షన్లు పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి
జె పంగులూరు:
కొండమంజులూరు గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ పంపిణీ చేసిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,ఈ సందర్భంగా మాట్లాడుతూ... భారతదేశంలో అత్యంత ఎక్కువ నగదును పెన్షన్ ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం గా ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వo అన్నారు..
సామాజిక పెన్షన్ పెంపుతో రాష్ట చరిత్రలో చందబ్రాబు నాయుడు నిలిచిపోయారని అన్నారు...
ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీల లో భాగంగా ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడమే కాక ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్,మే, జూన్ మూడు నెలలకు సంభంధించి మూడు వేల రూపాయలు కలిపి మొత్తం 7వేల రూపాయలు లబ్ధిదా రులకు పంపిణీ చేసి మాట నిలుపుకున్నారని అన్నారు...
టిడిపి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టబడి ఉంటుందని చిత్తశుద్ధి తో చెప్పిన ప్రకారం పెంచిన పింఛన్లు పంపిణీ జరుగుతోందని తెలిపారు.
రానున్న ఐదేళ్లలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో నడిపేందుకు ముందుంటుందని తెలిపారు.
చంద్రబాబు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ ను ప్రగతిశీల రాష్ట్రంగా చేసుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేస్తామని,అద్దంకి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
అద్దంకి నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని అన్నారు,ప్రజలకు ఉపయోగపడే సాగు, తాగు నీటి పథకాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేస్తానని తెలిపారు.
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పై సంతకం పెట్టారని త్వరలో రాష్ట్రానికి పరిశ్రమలు తెప్పించి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారని తెలిపారు..
పేద, సాధారణ, మధ్యతరగతి రైతుల భూములు కబ్జా చేసేందుకే జగన్ రెడ్డి భూ హక్కు చట్టం తీసుకొచ్చాడని, రెండవ సంతకం టైట్లింగ్ చట్టం రద్దుపై పెట్టి రైతులను విముక్తి చేశారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0