ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనను కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసిపి అద్దంకి నియోజకవర్గ నాయకులు
ఉండవల్లి చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనను కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసిపి అద్దంకి నియోజకవర్గ నాయకులు
ఊహించినట్లే జరిగింది...
అద్దంకి నియోజకవర్గం వైసీపీ మాజీ ఇంచార్జ్ బాచిన కృష్ణ చైతన్య, సీనియర్ వైసీపీ నాయకుడు చైతన్య తండ్రి చెంచు గంటయ్య టిడిపి తీర్థం పుచ్చుకున్నారు...
ఉండవల్లి లోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయనను కలిసి తెలుగుదేశం కండువా కప్పుకున్నారు..
2019లో బాచిన చెంచు గరటయ్య, టిడిపి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ పై వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు...
ఓటమి అనంతరం మొదటి సంవత్సరం అద్దంకి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నారు...
అనంతరం తన కుమారుడు కృష్ణ చైతన్యకు సీఎం జగన్తో మాట్లాడి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు...
అప్పటినుండి కృష్ణ చైతన్య ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు వివిధ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాలలో ఏమరుపాటు లేకుండా విస్తృతంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు..
అయితే చైతన్య వలస వచ్చిన తెలుగుదేశం వాళ్ళకి అధిక ప్రాధాన్యతనిస్తూ అసలు అది నుండి వైసీపీలో ఉన్న నాయకులను కార్యకర్తలను విస్మరించారనేది ప్రధాన ఆరోపణ... ప్రశ్నించిన వారిపై కక్షపూరిత చర్యలకు పాల్పడ్డారనేది ఆరోపణ.. ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా ప్రత్యర్థి వర్గం బలంగానే వినిపించింది..
అసమ్మతి అసంతృప్తి వర్గం వారంతా అద్దంకి నియోజకవర్గ పరిరక్షణ సమితి పేర ఒక ఉద్యమాన్నే నడిపారు..వైసీపీ అధిష్టానం చేసిన పలు సర్వేలలో కూడా ఆయనకు వ్యతిరేకంగా రిపోర్టులు వచ్చినట్లు సమాచారం..
ఈ నేపథ్యంలో గొట్టిపాటి రవిని ఎదుర్కొనేందుకు ఎవరు ముందుకు రాక పోవడంతో రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఉత్సాహంతో ఉన్న పానెం హనీమిరెడ్డిని సీఎం జగన్ బరిలోకి దించారు... అయినా ఆశ చావని బాచిన వర్గం మొన్న మొన్నటి వరకు టికెట్ కోసం ప్రయత్నాలు చేసింది.. అయితే ఎలాంటి సానుకూల స్పందన అధిష్టానం నుండి రాకపోవడంతో పూలమ్మిన చోట కట్టెలు అమ్మేందుకు ఇష్టం లేని బాచిన తెలుగుదేశం తీర్థం పుచ్చుకుని ఉండొచ్చని అంచనా...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0