సీనియర్లకు తనదైన శైలిలో మొండి చేయి చూపుతున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం
సీనియర్లకు తనదైన శైలిలో మొండి చేయి చూపుతున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం
తెలుగుదేశం సీనియర్లకు షాక్ ల మీద షాక్ లు ఇచ్చేందుకు టిడిపి అధిష్టానం సిద్ధమవుతుంది...
ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకునే దిశగా చంద్రబాబు...లోకేష్ పావులు కదుపుతున్నారు...
విజయవాడ తూర్పు నియోజకవర్గం వంగవీటి రాధకు దాదాపుగా కేటాయించినట్లే సమాచారం.. వంగవీటి రాధ ఈ ఎన్నికలలో తూర్పు వైపు మొగ్గు చూపుతున్న కారణంగా అధిష్టానం గద్దె రామ్మోహన్ ని తప్పించే నిర్ణయం తీసుకొంది
దీంతో గద్దె రామ్మోహన్ రావు పరిస్థితి ఏంటి అనేది ఆయన క్యాడర్ను పట్టిపీడిస్తుంది...
విలువలకు ప్రాధాన్యతనిస్తూ తెలుగుదేశం పార్టీ లో కీలక వ్యక్తి అయినా రామ్మోహన్రావుకు టికెట్ కేటాయించకపోతే ఇంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని అభిప్రాయం కేడర్లో వ్యక్తం అవుతుంది...
ఇటీవల అధిష్టానం పై కారాలు మిరియాలు నూరుతున్న దేవినేని ఉమకు గన్నవరం కేటాయించనున్నట్లు సమాచారం..
అదే జరిగితే పాపం ఎన్నో ఆశలతో వైసిపి నుండి వలస వెళ్లిన యార్లగడ్డ వెంకట్రావు పరిస్థితి అగమ్యగోచరమవుతుంది....
ఇప్పటికే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు నూజివీడులో తనకు టికెట్ రాదని అధిష్టానం చెప్పడంతో టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు..దాదాపుగా వైసీపీలో చేరనున్నారు...
ఇక రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి తను రాజమండ్రి రూరల్ బరిలోనే ఉంటానని ప్రకటించారు..
అయితే ఆ సీటు కందుల దుర్గేష్ కి జనసేన తరఫున ఇవ్వడం ఖరారైంది...
ఇక బుచ్చయ్య చౌదరి ఇండిపెండెంట్గా ఎన్నికల బరిలో ఉంటాడేమో వేచి చూడాలి
తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాలు వల్ల మున్ముందు క్యాడర్లో ఉవెత్తున ఆగ్రహ జ్వాలలు ఎగసిపడే అవకాశం ఉందనేది పరిశీలకుల అంచనా...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0