జనసేన టిడిపిలో టికెట్ల కేటాయింపు గొడవ కొనసాగుతూనే ఉంది
జనసేన టిడిపిలో టికెట్ల కేటాయింపు గొడవ కొనసాగుతూనే ఉంది
15 ఎకరాలు, ఇల్లు అమ్ముకొని...పార్టీ కోసం ఐదు సంవత్సరాల నుండి గడప గడపకి నియోజకవర్గ మొత్తం పర్యటించా... ఇంటింటికి వివిధ రకాల మొక్కలను పంచా.. కరోనా కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి పెరటి తోటలలో కూరగాయల మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించా... స్పందన కార్యక్రమంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నించా...ఇంత చేసినా తనకు టికెట్ కేటాయించకపోవడం తీరని అన్యాయం అని.. ఇలాంటి అన్యాయం ఎవరికీ జరగకూడదు అంటున్నారు జనసేన జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్ ఫాతంశెట్టి సూర్యచంద్ర...
ఇదేనా పవన్ కళ్యాణ్ చెబుతున్న సామాన్యుడికి అధికారం అన్న సూత్రం... అని సూటిగా ప్రశ్నిస్తుంది సూర్యచంద్ర సతీమణి.. ఇల్లు వాకిల్లు వదిలి ఐదు సంవత్సరాలు పార్టీ కోసం కృషి చేస్తే డబ్బు మూటలేదని తమకి ఇంత అన్యాయం చేస్తారా అని ఆమె ప్రశ్నిస్తుంది...
కొత్తపేట టికెట్ టీడీపీకి దక్కడంతో భగ్గుమంటున్నాయి జనసేన వర్గాలు...
బీసీ కులానికి చెందిన బండారు శ్రీనివాసరావు 10 సంవత్సరాల నుండి పార్టీ కోసం పడుతున్న కష్టం బుగ్గిపాలుని అయిందని జనసేన శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి...
ఆలమూరు పార్టీ ఆఫీసులో జండాలు పీకేసి తమ ఆందోళన వ్యక్తం చేశాయి...
జెండాలు ఫ్లెక్సీలు అవమానం భరించలేక దగ్ధం చేసాం అంటున్నాయి జనసేన శ్రేణులు...
కొత్తపేటలో కూడా అదే పరిస్థితి తమ నాయకుడికి టికెట్ కేటాయించకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ తమ నాయకుడే తమకు ముఖ్యమని పవన్ కళ్యాణ్ తమకు ముఖ్యం కాదని జనసైనికులు చెబుతున్నారు...
ఇక రాజమండ్రి రూరల్ పొత్తులో భాగంగా తనకు జనసేన పార్టీ తరఫున రూరల్ లో పోటీ చేసే అవకాశం లేదని ఈ మేరకు తనకు సమాచారం అందించారని జనసేన రూరల్ ఇంచార్జ్ కందుల దుర్గేష్ స్పష్టం చేశారు...
తనను నిడదవోలు నుండి పోటీ చేయమని చెబుతున్నారని ఈ విషయమై సమగ్రంగా కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు...
ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాల సామాజిక వర్గానికి టికెట్ కేటాయించకపోవడం పట్ల టిడిపి మాల సామాజిక వర్గ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు...
జగ్గయ్యపేట.. తిరువూరు.. పెడన నియోజకవర్గంలలో 2019లో మాదిగల కు రెండు మాలకు ఒకటి చొప్పున టిడిపి అధిష్టానం కేటాయింపులు చేసిందని.. కానీ ఈసారి మూడు మాదిగలకే ఇవ్వడం అత్యంత దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు...
మూడు లక్షల ఓట్లు తమకు ఉన్నాయని తమకు న్యాయం చేయకపోతే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు....
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0