మరి ఏం చేయాలో...పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో?
మరి ఏం చేయాలో...పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల ఉద్దేశం ఏమిటో?
వైసిపి టీం కిర్లంపూడి లో ముద్రగడ పద్మనాభం ని కలిసి వైసీపీలోకి ఆహ్వానించిన తర్వాత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు..
లేఖలు ద్వారా సలహాలు ఇచ్చేవారు వైసీపీలో చేరుతున్నారు అని వ్యాఖ్యానించారు...
వారి ప్రతిపాదనలకు నువ్వు స్పందించక మరి ఏ పార్టీలో చేరక ఎవరి దారి వారు చూసుకోక ఏం చేస్తారు అని నెటిజనులు పవన్ వ్యాఖ్యలను ఎండగడుతున్నారు...
కాపు నేతలుగా ముద్రపడ్డ హరిరామ జోగయ్య... ముద్రగడ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిగా చూడాలనేది వారి ఆకాంక్ష...
మరి వారి ఆకాంక్షకు అనుగుణంగా కాక టిడిపి తో అంట కాగుతుంటే వారి నిర్ణయాలు వారు తీసుకోవాలి కదా అని నెటిజనులు విమర్శిస్తున్నారు.
వారి లేఖలకు కనీస స్పందన లేకుండా నాకు సలహాలు ఇచ్చే వాళ్ళు అవసరం లేదు... సలసల మరిగే ఉడుకు రక్తంతో పోరాటాలు చేసే వాళ్ళు... జగన్ని దించేవాళ్లు కావాలనే ఆకాంక్షతో టిడిపి తో వెళితే మరి కాపులకు రాజ్యాధికారం మాటేమిటి అని వారు ప్రశ్నిస్తున్నారు..
ఇదిలా ఉండగా జనసేన అనలిస్ట్ బొలిశెట్టి సత్యనారాయణ కాపులకు రాజ్యాధికారం కోసం ఆది నుండి ప్రయత్నం చేస్తున్న ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి వెళ్లరనే ధీమా వ్యక్తం చేశారు...
ఒక చర్చ వేదికలో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యలు చేస్తూ ఆయన బిజెపి పార్టీలో చేరే అవకాశం ఉందని తెలిపారు..
దాదాపుగా టిడిపి జనసేన బిజెపి పొత్తులు ఖరారు అయినట్లుగా సమాచారం.... తె
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వృద్ధాప్య దశలో ఉన్నందున భవిష్యత్తులో జనసేన బిజెపి వ్యూహంలో భాగంగా కాపులకు నిర్ణయాత్మక పాత్ర ఉంటుందనే ఆలోచన కూడా జనసేన నాయకులు చేస్తున్నట్లు సమాచారం...
మరి బొలిశెట్టి వ్యాఖ్యల ప్రకారం బిజెపిలో ముద్రగడ చేరే అవకాశం ఉంటుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న?
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0