అయితే రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఓట్ షేర్ లో టిడిపి కంటే వైసీపీ 15% అధికం
అయితే రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఓట్ షేర్ లో టిడిపి కంటే వైసీపీ 15% అధికం
ప్రముఖ సేఫాలజిస్ట్ పార్థాదాస్ వివిధ గణాంకాలతో చేసిన సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా 15 శాతం అదనపు మహిళా ఓటు షేర్ తో వైసిపి ముందంజలో ఉందని అంచనా వేశారు..
ఆయన అంచనా ప్రకారం పురుషుల ఓట్ షేర్ టీడీపీ కూటమికి 50 శాతం పైగా వైఎస్సార్ సీపీకి 46% పైగా కాంగ్రెస్‌కు రెండు శాతం పైగా వస్తుంది..
అంటే దాదాపు వైసీపీ 5% పురుషుల ఓటు షేర్ లో వెనుకబడి ఉంది...
ఇక మహిళల ఓట్ షేర్ లో టిడిపి కూటమికి 41% పైగా వైఎస్సార్సీపీకి 56% పైగా కాంగ్రెస్‌కు రెండు శాతం పైగా వస్తుంది...
ఈ ప్రకారం దాదాపు మహిళా ఓట్ షేర్ లో వైసిపి దాదాపు 15% అదనంగా పొందుతున్నట్లు అంచనా వేశారు...
ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో టిడిపి 8 నుండి 9 సీట్లు కైవసం చేసుకుంటుందని వైయస్సార్సీపి ఐదు నుండి 6 సీట్లు దక్కించుకుంటుందని అంచనా వేశారు..
ఇక్కడ ఈ జిల్లాలో పురుషుల ఓటు షేర్ వైఎస్ఆర్సిపి కి 43% టిడిపి కూటమికి 51% కాంగ్రెస్‌కి ఐదు శాతం దక్కుతుందని తెలిపారు...
అదే విధంగా మహిళల ఓట్ వైయస్సార్సీపీకి 53% టిడిపి కూటమికి 43% కాంగ్రెస్ కి నాలుగు శాతం వస్తుందని అంచనా వేశారు...
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన ఇచ్చిన అంచనాల ప్రకారం ఈ ఉమ్మడి జిల్లాలో కూడా పురుషుల మహిళల ఓటు షేరును కలిపి లెక్కిస్తే రెండు శాతం ఓటు షేరు వైసిపి కూటమికంటే అదనంగా దక్కించుకుంటుంది...
ఇక పివీఎస్ శర్మ...ఈయన గత కొంతకాలంగా సర్వేలు వెలువరిస్తున్నారు..
ఈయన అంచనాల ప్రకారం 1౦4 నుండి 110 అసెంబ్లీ స్థానాలు.. 17 లోక్‌సభ స్థానాలు వైసిపి కైవసం చేసుకుంటుంది..
టిడిపి కూటమి 55 నుంచి 65 శాసనసభ స్థానాలు.. ఏడు లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని వెల్లడించారు..
ఇంకా వారం రోజుల ప్రచార కార్యక్రమం మిగిలి ఉందని... అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని మరల ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఎన్నుకునేందుకు రాష్ట్ర ప్రజలు సంసిద్ధులయ్యారని ఆయన అంచనా వేశారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024సీఎం జగన్ ని కలిసిన పర్చూరు వైసీపీ నేతలు.. బాలాజీ నియామకంతో వర్గ విభేదాల సమసి పోనున్నాయా?
February 21, 2024ప్రకాశం జిల్లాలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవు... ఆందోళన చెందవద్దు. జిల్లా పశు వైద్యాధికారి బేబీ రాణి
February 18, 2024
Comments 0