సిద్ధం సభకు వచ్చిన ప్రజలు బలవంతంగా తరలించబడ్డారా.. స్వచ్ఛందంగా వచ్చారా
సిద్ధం సభకు వచ్చిన ప్రజలు బలవంతంగా తరలించబడ్డారా.. స్వచ్ఛందంగా వచ్చారా
మేదరమెట్ల సిద్ధం సభకు 15 లక్షల మందికి పైగా ప్రజలు తరలివచ్చినట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి..
ఒక్క మాటలో చెప్పాలంటే ఆ విధంగా తరలివస్తున్న జనాలని చూసి పోలీసులే ఒకింత నిర్గాంత పోయినట్లు వారే చెబుతున్నారు..
రెండు కిలోమీటర్ల దూరంలో బస్సులు ఇతర వాహనాలను ఆపవలసిన పరిస్థితి పోలీసులకు ఎదురైంది..అలాంటి సమయంలో రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లేందుకు తమ అభిమాన నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఏమాత్రం వారు వెనుకంజ వేయలేదు..రెండు కిలోమీటర్లు నడి ఎండలో మీరు వెళ్లేసరికి సభ కూడా అయిపోతుంది ఏమో అని వారించిన పోలీసుల మాట పెడచెవిన పెట్టి మా ప్రయత్నం మేం చేస్తాం అయ్యా అంటూ సభా ప్రాంగణానికి వెళ్లిన అభిమానుల ఆదరణను మరి ఏ విధంగా అంచనా వేయాలి....
ఉదయాన్నే నా బిడ్డను స్వయంగా చూడాలని ఏడు గంటలకు వచ్చిన ముసలి తల్లి అభిమానాన్ని ఏమనాలి...
30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చదలవాడ నుండి ఒక దివ్యాంగుడు హుషారుగా సభా ప్రాంగణానికి తన ట్రై సైకిల్ పై తరలి రావడానికి ఏమని అనాలి...
హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో స్వచ్ఛందంగా జగనన్న జగనన్న అంటూ పెద్ద పెట్టున నినదించిన వారి అభిమానాన్ని ఏమనాలి ...
తిరుపతి కుప్పం రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన మహిళా మణుల అభిమానాన్ని ఏమనాలి..
కొందరైతే వారి ప్రాంతంలో సిద్ధం సభ జరిగినప్పుడు హాజరుకాని అభిమానులు సైతం చివరి సిద్ధం సభకు గోదావరి జిల్లాల నుండి కృష్ణాజిల్లా నుండి పరుగెత్తుకుంటూ వచ్చారు...
అదే జగన్మోహనుడు ప్రజలలో తను సంపాదించుకున్న అభిమాన ధనం...
ఆ అభిమాన ధనమే ఆయనలో స్పష్టమైన ఆత్మవిశ్వాసం నింపిందని ఆయన ప్రసంగ సరళి ముగింపు సిద్ధం సభలో తేట తెల్లం చేసింది...
అయితే కర్మ ఏంటంటే ఈ రాష్ట్రానికి పట్టిన పచ్చ మీడియా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు తెలిసినా వారు సిద్ధం సభ మీద చేసిన దుష్ప్రచారం తెలుగుదేశం పార్టీ శ్రేణులనితప్పు దోవ పట్టించడం ద్వారా మరింత పతనానికి ఆ పార్టీ దిగజారుతుంది అని ఆలోచన లేకపోవడం అత్యంత భావ దారిద్యం అనేది పరిశీల కుల అంచనా...
ఈరోజు ఆంధ్రజ్యోతి ఆన్లైన్ ఎడిషన్ లో వారు ప్రచురించిన వార్త లో సీఎం జగన్ చేసిన ఉపన్యాసం వైసీపీ శ్రేణులను నిరుత్సాహపరిచిందట..
అధికారం మీద ఆశ లేదు కానీ పేద ప్రజలు నష్టపోకూడదనే నా తపన.. అందుకే ఈ నా పోరాటం అని సీఎం జగన్ చెప్పటం రానున్న ఎన్నికల్లో తన ఓటమిని ఊహించి... ప్రభుత్వ పథకాలు పొందుతున్న రాష్ట్ర లబ్ధిదారులైన ప్రజలని బ్లాక్ మెయిల్ చేయడమే అని వక్రీకరించింది...
అందుకే ముఖ్యమంత్రి జగన్ మొదటి సిద్ధం సభలోనే రానున్న 50 రోజుల కాలంలో ఇంకా మరింత విష ప్రచారం ఈ పచ్చ ఛానళ్లు చేశారు చేస్తాయని చెప్పకనే చెబుతూ అవి నమ్మొద్దు అని రాష్ట్ర ప్రజలకు తేట తెల్లం చేశారు...
మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసి... బిజెపి పిలుపు కోసం పడిగాపులు కాచి.. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వదిన పురందేశ్వరి మధ్యవర్తిత్వంతో పొత్తులు కుదుర్చుకుని వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు బేలతనం గురించి ఈ పచ్చ పత్రికలలో ప్రస్తావనే ఉండదు సరి కదా చంద్రబాబు విదిలించిన సీట్లతో బిజెపి సంతృప్తి పడ్డది అని బాకా ఊదుతాయి..
కానీ ఎంత దుష్ప్రచారం చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి విఫలయత్నాలే అవుతాయి అనేది సిద్ధం సభల ద్వారా జగన్ మోహన్ రెడ్డి మీద ప్రజలలో ఉప్పొంగిన అభిమానం తెలియజేస్తుంది...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0