ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరి వైసిపి లో చేరిక
ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరి వైసిపి లో చేరిక
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి చేరారు...
ముద్రగడ పద్మనాభంని సాదరంగా ముఖ్యమంత్రి జగన్ వైసీపీ లోకి ఆహ్వానించారు...
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు , ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
జనవరిలోనే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారు అనుకున్న సమయంలో ఆయన మనసు జనసేన వైపు మళ్ళింది...
కాపు నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు వచ్చి ఆయనను జనసేనలో చేరమని ఆహ్వానించారు..
పవన్ కళ్యాణ్ తనను వచ్చి కలిసిన తర్వాత తప్పకుండా జనసేనలో చేరతానని ముద్రగడ వారికి తెలిపారు..
ఆ మేరకు కాపు నాయకులు కూడా ముద్రగడ ను పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిరానికి వెళ్లి వచ్చిన తర్వాత కలుస్తారని చెప్పారు...
కానీ పవన్ కళ్యాణ్ ముద్రగడను కలవకపోవడంతో.. మీరు నా వద్దకు రాకుండా ఏదో శక్తి మిమ్మల్ని అడ్డగిస్తుండట్లుంది అంటూ లేఖ రాసి... చంద్రబాబుకి పరోక్షంగా చురకలు అంటించారు...
అనంతరం ఈ పరిణామాన్ని మిథున్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి అనుకూలంగా మార్చుకొని ముద్రగడను ఎట్టకేలకు వైసీపీలో చేర్చడంలో సక్సెస్ అయ్యారు...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0