నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి వైసీపీ ఇన్చార్జిగా అరబిందో శరత్ చంద్రారెడ్డి నియామకం
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి వైసీపీ ఇన్చార్జిగా అరబిందో శరత్ చంద్రారెడ్డి నియామకం
నెల్లూరు ఎంపీ స్థానానికి వైఎస్ఆర్సిపి ఇన్చార్జిగా అరబిందో శరత్ చంద్రారెడ్డిని నియమిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు....
తొలుత నెల్లూరు ఎంపీ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయమైన అనంతరం జరిగిన పరిణామాలలో ఆయన అలిగి పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చారు...
ఈ నేపథ్యంలో వేమిరెడ్డి స్థానంలో దేవి రెడ్డి సుధాకర్ రెడ్డి తదితరుల పేర్లు వినిపించినప్పటికీ శరత్ చంద్రారెడ్డి వైపు సీఎం జగన్ మొగ్గు చూపారు.... శరత్ చంద్ర రెడ్డి కుటుంబీకులు ఫార్మా ఇండస్ట్రీలో అరబిందో ల్యాబ్స్ పేరున స్థిర పడటంతో పాటు, వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుండి వైయస్ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నారు..ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకమైన వ్యక్తులకి కీలకమైన జిల్లాల బాధ్యతలు అప్పగింతల ద్వారా పార్టీ బలోపేతానికి తన ఆలోచనలకి అనుగుణంగా పార్టీని చక్కదిద్దుకోవడానికి బాగుంటుందని నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా తెలుస్తుంది....
అందులో భాగంగానే ఒంగోలు పార్లమెంటుకు చెవిరెడ్డి, గుంటూరు,కృష్ణ జిల్లాలో అయోధ్య రామ రెడ్డి, రాయలసీమ గోదావరి జిల్లాలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి...సుబ్బారెడ్డి... విజయసాయిరెడ్డి ఉండనే ఉన్నారు.. శరత్ చంద్ర రెడ్డి విజయసాయి రెడ్డికి అల్లుడు కూడా అవుతాడు.. ఆయన నెల్లూరు జిల్లా వాసి...
నాయుడుపేట సమీపంలో అరబిందో ఫార్మా కూడా నెలకొల్పారు... ఆ ప్రాంతవాసులకు కొంతమేర కొన్ని వందల మందికి తమ డ్రగ్స్ కంపెనీ ద్వారా ఉపాధి కల్పిస్తున్నారు..ఈ నేపథ్యంలో అరబిందో శరత్ చంద్ర రెడ్డి సరైన అభ్యర్థిగా భావించి ఆయన వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గుచూపినట్లు సమాచారం...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0