ఉమ్మడి ప్రకాశం లో ఒంగోలు నియోజకవర్గ పోరు రసవత్తరం డి అంటే డి అంటున్న బాలినేని ...దామచర్ల
ఉమ్మడి ప్రకాశం లో ఒంగోలు నియోజకవర్గ పోరు రసవత్తరం డి అంటే డి అంటున్న బాలినేని ...దామచర్ల
ఆత్మీయ సమ్మేళనాల పేరుతో కులాల వారీగా ఎన్నికలలో ఓట్ల సమీకరణకు ప్రధాన పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి...
ఈనెల మూడవ తేదీన ఒంగోలు టిడిపి అభ్యర్థి దామచర్ల జనార్ధన్ తరఫున బ్రాహ్మణులకు ఒంగోలు పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం జరగనుంది...
ఈనెల ఐదవ తారీఖున వైయస్సార్సీపి ఆధ్వర్యంలో ఒంగోలు ఏ వన్ ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య సమ్మేళనం జరుగుతుంది...
ఈ సమ్మేళనానికి యాంకర్ మృదులతో పాటు మరికొందరు యాంకర్లు ఆటపాటలతో వ్యాఖ్యానాలతో పసందు చేయనున్నారు...
ప్రకాశం జిల్లాలో ఒంగోలు లో దామచర్ల బాలినేని మధ్య హోరాహోరీ పోటీ నెలకొని ఉంది...
అనునిత్యం ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు...
ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు ఒంగోలు పట్టణంలో సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైనేజీలు నిర్మించాం దాదాపు 25 వేల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించాం ఒంగోలులో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నాం రానున్న ఎన్నికల్లో గెలిపిస్తే ఒంగోలు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాను అంటున్నారు బాలినేని...
ప్రతిరోజు అసత్యాలు అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు అని దామచర్ల బాలినేని కి కౌంటర్ ఇస్తున్నారు...
సెంటిమెంట్ రాజకీయాలు... ప్రలోభాలతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలను ప్రభావితం చేయలేవు అని... ఒంగోలు ప్రజలకు ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందనేది తెలుసునని దామచర్ల జనార్ధన్ నిశితంగా విమర్శిస్తున్నారు..
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే రసవత్తరంగా ఒంగోలు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరు విజేతలవుతారో జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0