ముఖ్యమంత్రి.. టీటీడీ చైర్మన్ ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల కనీస నష్ట పరిహారం ఇవ్వాలి
ముఖ్యమంత్రి.. టీటీడీ చైర్మన్ ఈ దుర్ఘటనకు బాధ్యత వహించి మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల కనీస నష్ట పరిహారం ఇవ్వాలి
ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా టీటీడీ చైర్మన్ టిటిడి అధికారులు ఎస్పి కలెక్టర్ అందరూ తిరుపతి దుర్ఘటనలో భాగస్వాములే.. ఇది ఘోర ప్రభుత్వ తప్పిదం అని నిశితంగా విమర్శించారు మాజీ సీఎం జగన్..
8 తేదీ మధ్యాహ్నం వరకు కుప్పం పర్యటనలో మూడు రోజులు ఉన్న చంద్రబాబు సేవలో పోలీసులు నిమగ్నం అయ్యారు..
ఎనిమిదవ తేదీ రాత్రి టికెట్లు ఇచ్చేందుకు సరైన క్యూలైన్లు ఏర్పాటు చేయకుండా పోలీసుల పర్యవేక్షణ లేకుండా గేట్లు తీసివేయడంతో జరిగిన తీవ్రతోపులాటలో ఈ దుర్ఘటన జరిగింది..
కేవలం బైరాగి పాఠశాల సెంటర్ విష్ణు నివాసమే కాకుండా ప్రతి కౌంటర్లు తోపులాట జరిగింది అనేది పద్మావతి వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల వేదన వింటే అర్థమవుతుంది..
స్వయంగా క్షతగాత్రులు పోలీసులు టీటీడీ పూర్తిగా విఫలమైందని స్పష్టం చేస్తున్నారు..
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురి అమాయకప్రాణాలు బలి అయ్యాయి..
ఒక్కొక్క కుటుంబానికి కనీసం 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి..
కనీస వసతి సదుపాయాలు క్యూలైన్లు ఏర్పాటు చేయడంలో పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది..
తాము విఫలమై అబద్ధాలకు రెక్కలు కట్టేందుకు ప్రయత్నం చేస్తుంది అని తీవ్రంగా విమర్శించారు వైయస్ జగన్..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0