బిజెపి జనసేన కూటమికి కేటాయించిన 31 అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ సీట్లలో కోత విధించే ఆలోచనలో చంద్రబాబు?
బిజెపి జనసేన కూటమికి కేటాయించిన 31 అసెంబ్లీ ఎనిమిది పార్లమెంట్ సీట్లలో కోత విధించే ఆలోచనలో చంద్రబాబు?
గందరగోళంలో ఆంధ్రప్రదేశ్లో టిడిపి జనసేన బిజెపి పార్టీల పొత్తు వ్యవహారం..
అనేక స్థానాల్లో టిడిపి జనసేన పార్టీలలో ఇప్పటికే జరిగిన అభ్యర్థుల కేటాయింపు ఇరు పార్టీలలో తీవ్ర అసమ్మతిని రాజేసింది...
పవన్ కళ్యాణ్ అసంబద్ధ ప్రకటనలు జనసేనలో పూర్తి నిరాశ నిస్సహాలకు క్యాడర్ను గురి చేయడంతో పాటు తీవ్ర గందరగోళంలో జనసేన పరిస్థితి ఉంది..
అమిత్ షా కోరితే కాకినాడ ఎంపీగా వెళ్తానేమో అప్పటివరకు పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిని నేనే అని చేసిన ప్రకటన పవన్ కళ్యాణ్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం గా తేటతెల్లమవుతుంది...
ఇంతలోనే ఆ ప్రకటనకు స్పందనగా పిఠాపురం తెలుగుదేశం ఇంచార్జ్ వర్మ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీచేయని పక్షంలో తానే పోటీ చేస్తానని ప్రకటించారు..
ఇక తెలుగుదేశం పార్టీలో పలుచోట్ల అసంతృప్తి అసమ్మతి సెగలు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..
మరోవైపు చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి పట్ల భాగస్వామి బిజెపి లోని పాత కాపులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు...
ఇంకొక వైపు చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీ నుండి ఆశించిన విధంగా తమకు అనుకూల స్పందన లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఒకింత ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది...
ఒకవైపు టికెట్లు దక్కని వారి ఆందోళన..రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తి.. వెరసి జనసేన బిజెపి కూటమికి ఇస్తానన్న సీట్ల కుదింపుకు చంద్రబాబు యోచన చేస్తున్నారు అనేది సమాచారం...
ఆ రెండు పార్టీలకు ఇస్తానన్న 31 అసెంబ్లీ సీట్లలో 4...5 సీట్లు, అదేవిధంగా పార్లమెంట్ స్థానాలు చెరి ఒకటి ఇచ్చే దిశగా నయా ప్రపోజల్స్ పెట్టాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది..
అయితే జనసేన అధినేత పవన్ సర్దుకుపోయిన బిజెపి అధినాయకత్వం దానికి అంగీకరించకపోతే ఏం చేయాలి అనే ఆలోచనలో తెలుగుదేశం అధినేత మల్ల గుల్లాలు పడుతున్నట్లు సమాచారం...
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి..
బిజెపికి జనసేనకు అన్ని సీట్లు కేటాయించడం అనవసరము అని టిడిపిలోని కిలక నేతలు చెబుతున్నట్లు సమాచారం..
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0