జనసేన టిడిపి కీలక నేతలు సీఎం సమక్షంలో వైసీపీ తీర్థం
జనసేన టిడిపి కీలక నేతలు సీఎం సమక్షంలో వైసీపీ తీర్థం
పలువురు కీలక నేతలు వైసిపి పార్టీలో సీఎం జగన్ సమక్షంలో నేడు చేరారు..
కడప జిల్లా రాయచోటి నుండి రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి వైసీపీ కండువా కప్పుకున్నారు.. తనకు టిడిపిలో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రమేష్ రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకున్నారు..
ఈయన సోదరుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి కడప జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఉండగా మరదలు మాధవి రెడ్డి కడప నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు..
అలాగే పి గన్నవరం నుండి జనసేన నేత పాములపాటి రాజేశ్వరి వైసీపీ కండువా కప్పుకున్నారు..
జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు.
జనసేనానని పవన్ కల్యాణ్ పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకం అని… భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్ కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని… తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి అన్నారు. ఇవాళ ఉదయం రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా వైఎస్సార్సీపీలో చేరారు. సీఎం జగన్ వీరి ముగ్గురికి పార్టీ జెండా కప్పి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0