చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుండి బయటకు వెళ్లి ఓడిపోయి మరల తిరిగి వచ్చాడు
చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుండి బయటకు వెళ్లి ఓడిపోయి మరల తిరిగి వచ్చాడు
మోదీని హార్డ్ కోర్ టెర్రరిస్టు అని చంద్రబాబు వ్యాఖ్యానించారని అలాంటి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం ఎంతవరకు సబబు అని ఇండియా టుడే ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అమిత్ షాను ప్రశ్నించిన వీడియో వైరల్ అవుతుంది..
ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చిన అమిత్ షా చంద్రబాబు నాయుడు అలా వ్యాఖ్యానించారనేది తనకు తెలియదని 2019 ఎన్నికలకు ముందు ఎన్ డి ఏ నుండి బయటకు వెళ్లిపోయి ఆ ఎన్నికలలో ఓడిపోయిన చంద్రబాబు మరల ఎన్డీఏలో చేరేందుకు వచ్చారని తెలిపారు...
ఇదిలా ఉండగా బిజెపి అధిష్టానానికి విష్ణువర్ధన్ రెడ్డి తో పాటు కొందరు బిజెపి నాయకులు రాసిన లేఖ కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది..
పొత్తుకుతాము వ్యతిరేకం కాదని అయితే పొత్తు ముసుగులో ఆది నుండి బిజెపిని నమ్ముకున్న వ్యక్తులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు..
టిడిపి గాని బిజెపి గాని గెలవని నియోజకవర్గాలు బిజెపి కేటాయించాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు...
అందునా తెలుగుదేశం నుండి బిజెపిలోకి వలస వచ్చిన వారికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతను ఇస్తున్నారని తీవ్ర విమర్శ చేశారు...
మరి కేంద్ర బిజెపి అధిష్టానం ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0