నాలుగు వేల రూపాయల పింఛన్ హామీ మాయం..ఇదేం పని చంద్రబాబు.. పేర్ని నాని
నాలుగు వేల రూపాయల పింఛన్ హామీ మాయం..ఇదేం పని చంద్రబాబు.. పేర్ని నాని
ఈనాడులో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచురితమైన యాడ్ విమర్శలకు కేంద్రబిందువైంది...
సదరు యాడ్లో సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా 4 వేల రూపాయల పింఛన్ హామీ కనిపించలేదు..
దాంతోపాటు ప్రధాని మోదీ ఫోటో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటో లేవు..
ఒక చంద్రబాబు ఫోటో తోనే ఆ యాడ్ ప్రచురితమైంది..
దీన్నే ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు వైసీపీ నాయకులు వారి సోషల్ మీడియా...
పేర్ని నాని చంద్రబాబు నీ స్వభావాన్ని ఎలక్షన్లు కనీసం పూర్తికాకముందే బహిరంగపరిచావు అని పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు..
ఈ అంశం తో పాటు తాజాగా అవ్వ తాతల పింఛన్ల పంపిణీ ప్రహసనంగా మారింది..
బ్యాంకులకు వెళ్లి అవ్వ తాతలు క్యూ కడుతున్నారు..
ఆధార్ కార్డు లింక్ కాకనో.. అకౌంటు యాక్టివ్గా లేకనో... మూడు నాలుగు ఎకౌంట్లు ఉన్న పింఛనుదారుడు ఏ అకౌంట్లో పడిందో తెలుసుకోవడానికి నానా ఆగచాట్లు పడుతున్నారు...
నిమ్మగడ్డ రమేష్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఫిర్యాదులు డైరెక్ట్ గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లకు పెన్షన్ జమ చేయాలి అని చెప్పిన అంశాన్ని వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా అందుకు సంబంధించిన రమేష్ కామెంట్స్ ఉన్న వీడియో వైరల్ చేస్తుంది...
ఇంకా కేవలం పది రోజులే ఓటు వేయడానికి డెడ్లైన్ కాగా ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకుండా అధికార ప్రతిపక్షాలు ఎన్నికల వేడి విమర్శనాస్రాల రూపంలో ఆరోపణల రూపంలో పెంచాయి...
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
ప్రశ్నించే గొంతుకను ఎవరు అణచివేయలేరు... వైసిపి సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవి కిరణ్
November 10, 2024మొదటి లిస్టులో సీనియర్లకు దక్కని చోటు.. తెలుగుదేశం శ్రేణుల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలు
February 24, 2024
Comments 0